'శుభలేఖ+లు' రెండ‌వ ట్రైల‌ర్‌ని ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్ 

  • IndiaGlitz, [Tuesday,November 20 2018]

ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం.పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌తో వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సంద‌ర్భంగా సినిమా రెండో ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ త్రిమిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవ‌లె విడుద‌లైన మా ట్రైల‌ర్ కిగాని, టీజ‌ర్‌కిగాని ఇంత అద్భుత‌మైన స్పంద‌న ల‌భించడం చాలా ఆనందంగా ఉంది. ఇండ‌స్ర్టీలో ఉన్న పెద్ద‌లంద‌రూ చూసి త‌మ మాట‌ల్లో మంచి పోజిటివ్ ఎన‌ర్జీని అందిస్తున్నారు. ఇంత మంది ప్ర‌ముఖుల ఆద‌ర‌ణ ఈ సినిమాకి ల‌భించ‌డం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైల‌ర్‌ని మేము అడిగిన వెంట‌నే త్రివిక్ర‌మ్‌గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషం ఆయ‌న‌కు మా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌లు విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్‌, బెల్లం కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌టీన‌టులుః శ్రీ‌నివాస్‌సాయి, ప్రియ‌వ‌డ్ల‌మాని, దీక్ష‌శ‌ర్మ‌రైనా, ఇర్ఫాన్‌, సింధు, తిరువీర్‌, వంశీరాజ్‌, మోనాబేద్రె, అప్పాజిఅంబ‌రీష త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత‌లుః విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌, క‌థ‌-మాట‌లుః జ‌నార్ధ‌న్ఆర్‌.ఆర్‌-విస్సు,క‌థాస‌హ‌కారంఃసి.విద్యాసాగ‌ర్‌,స్క్రీన్‌ప్లే-డైరెక్ష‌న్ఃశ‌ర‌త్‌న‌ర్వాడే, సంగీతంఃకె.యం.రాధాక్రిష్ట‌న్‌, డైరెక్ష‌న్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీఃయ‌స్‌.ముర‌ళీమోహ‌న్‌రెడ్డి, ఆర్ట్‌డైరెక్ట‌ర్ఃబ్ర‌హ్మ‌క‌డ‌లి, ఎడిట‌ర్ఃమ‌ధు, కొరియోగ్ర‌ఫీఃచంద్ర‌కిర‌ణ్‌, పి.ఆర్‌.ఓఃపుల‌గం చిన్నారాయ‌ణ‌, వీర‌బాబు బాసిశెట్టి, ప‌బ్లిసిటి డిజైన‌ర్ఃసుధీర్‌, స్టిల్స్ఃర‌ఘు, ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్ఃసూర్య‌నారాయ‌ణ‌క‌రుటూరి, కో-డైరెక్ట‌ర్ఃఎం.స‌ర్వేశ్వ‌ర‌రావు, ప్రొడ‌క్ష‌న్‌కంట్రోల‌ర్ఃప్ర‌వీణ్‌పాల‌కుర్తి.

More News

మ‌రో బ్యాన‌ర్ పెట్టే ఆలోచ‌న‌లో నాగ్‌..

నాగార్జున అగ్ర క‌థానాయ‌కుడు.. హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా ఆయ‌న ప‌లు సినిమాల‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నిర్మించాడు.

కొర‌టాల క‌మిట్‌మెంట్ పూర్తి చేయాల్సిందేనా

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో 'జ‌న‌తా గ్యారేజ్' సినిమా చేసిన త‌ర్వాత మ‌రో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు. కానీ ఇంకా పూర్తి చేయ‌లేదు.

వివాదంలో దీప్ వీర్ వివాహం

బాలీవుడ్ తార‌లు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె ఈ నెల 14,15 తేదీల్లో ఇట‌లీ లేక్ కోమోలో జ‌రిగిన వివాహంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే.

మ‌హేశ్ స‌ర‌స‌న బాల‌య్య హీరోయిన్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'మ‌హ‌ర్షి'. మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న 25వ చిత్ర‌మిది.

బాక్స‌ర్ పాత్ర‌లో వ‌రుణ్‌తేజ్‌...

ముకుంద‌, కంచె, మిస్ట‌ర్‌, ఫిదా, తొలిప్రేమ ఇలా జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా విభిన్నమైన పాత్ర‌లు, వైవిధ్య‌మైన క‌థాంశాలతో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌రు.