'ఓ పిట్టకథ' టైటిల్ పోస్టర్ ఆవిష్కరించిన త్రివిక్రమ్
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని కథలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. అతి తక్కువ నిడివితో పెద్ద పెద్ద విషయాలను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టకథలు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్రస్టింగ్ పిట్టకథను సెల్యులాయిడ్ మీద చూపించబోతోంది భవ్య క్రియేషన్స్. భారీ కమర్షియల్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచే భవ్య క్రియేషన్స్ తాజాగా తెరకెక్కించిన క్యూట్ కథకు `ఓ పిట్టకథ` అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
`ఓ పిట్టకథ` గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ``ఈ సినిమాతో నాకు ఒక లింకు ఉంది. అదేంటంటే నాకు ఈ కథ తెలియడమే. కథ విన్నప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ ఉంటే బావుంటుందనే డిస్కషన్ వచ్చినప్పుడు, దర్శకుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెప్పారు. అందులో `ఓ పిట్టకథ` నాకు చాలా బాగా నచ్చింది ఈ టైటిల్. `ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ` అనే క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అంతవరకే నా కంట్రిబ్యూషన్. కథ నచ్చింది. టైటిల్ బావుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఈ టైటిల్ పోస్టర్‌ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను`` అని చెప్పారు.
చిత్ర నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ ``మా సంస్థలో అగ్ర హీరో నందమూరి బాలకృష్ణతో `పైసా వసూల్`, అంతకు ముందు టాప్ హీరో గోపీచంద్‌తో `శౌర్యం`, `లౌక్యం`,`సౌఖ్యం` తరహా కమర్షియల్ చిత్రాలు చేశాం. ఓ వైపు భారీ బడ్జెట్‌తో ఫక్తు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, తేజతో `నీకు నాకు డాష్ డాష్` అని ఓ సినిమా చేసి కొత్తవారిని ప్రోత్సహించాం. అలా మరోసారి కొత్తవాళ్లతో సినిమా చేద్దామనుకున్నప్పుడు చెందు ముద్దు చెప్పిన ఓ చిన్న కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాం. ఆ కథే మేం తెరకెక్కించిన `ఓ పిట్టకథ. మా `ఓ పిట్టకథ` చిత్రం పోస్టర్ రిలీజ్ చేసిన మాటల మాంత్రికుడు, సక్సెస్‌ఫుల్ డైరక్టర్ త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు`` అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మాట్లాడుతూ `` ఓ వైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో కచ్చితంగా ఆకట్టుకుంటుంది మా `ఓ పిట్ట కథ`. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ``ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. మరోవైపు ఏం జరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. పతాక సన్నివేశాల వరకూ ఆ థ్రిల్లింగ్ అలాగే సస్టైన్ అవుతుంది. ట్విస్టులు మరింత థ్రిల్ కలిగిస్తుంటాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం. మా కథ, టైటిల్ నచ్చిందని చెప్పి, క్యాప్షన్ పెట్టిన గురూజీ త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout