త్రివిక్రమ్.. వరుసగా ఐదోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల రచయిత నుంచి దర్శకులుగా మారిన వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పంథాయే వేరు. దర్శకుడిగా మారిన తొలినాళ్ళలో పదునైన మాటలతో, భావోద్వేగమైన సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో సోలో హీరోయిన్ సబ్జెక్ట్‌లతోనే ఎక్కువగా సినిమాలు చేసిన త్రివిక్రమ్..గత కొంతకాలంగా తన శైలిని మార్చుకుంటున్నారు. కాస్త వివరాల్లోకి వెళితే.. తన తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ మొదలుకుని ఐదో చిత్రం ‘జులాయి’ వరకు (ఒక్క ‘జల్సా’ మినహాయిస్తే) అన్ని చిత్రాల్లోనూ ఒక్క హీరోయినే ఉంటుంది.
అయితే.. ‘అత్తారింటికి దారేది’ నుంచి వరుసగా ఇద్దరు హీరోయిన్ల సబ్జెక్ట్‌లను డీల్ చేస్తున్నారు ఈ మాటల మాంత్రికుడు. ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అఆ’, ‘అజ్ఞాతవాసి’ ఇవన్నీ కూడా ఇద్దరు హీరోయిన్‌లు నటించిన చిత్రాలు కావడం విశేషం. అలాగే ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ కూడా ఇద్దరు హీరోయిన్‌ల సబ్జెక్ట్ కావడం గమనార్హం. అందులో ఒకరు పూజా హెగ్డే కాగా.. మరో హీరోయిన్‌గా ఈషా రెబ్బా పేరు వినపడుతోంది. మొత్తానికి.. త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్ల సబ్జెక్ట్‌తోనే వరుసగా 5 చిత్రాలు చేస్తున్నారన్నమాట. మరి.. ఇద్దరు హీరోయిన్ల సినిమాలతో ఇప్పటికే పలు హిట్స్ అందుకున్న త్రివిక్రమ్.. ఈ చిత్రంతోనూ దాన్ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com