త్రివిక్ర‌మ్‌.. వ‌రుస‌గా ఐదోసారి

  • IndiaGlitz, [Thursday,May 24 2018]

మాటల రచయిత నుంచి దర్శకులుగా మారిన వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పంథాయే వేరు. దర్శకుడిగా మారిన తొలినాళ్ళలో పదునైన మాటలతో, భావోద్వేగమైన సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో సోలో హీరోయిన్ స‌బ్జెక్ట్‌ల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన‌ త్రివిక్రమ్..గ‌త కొంత‌కాలంగా త‌న శైలిని మార్చుకుంటున్నారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. త‌న తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ మొద‌లుకుని ఐదో చిత్రం ‘జులాయి’ వ‌ర‌కు (ఒక్క ‘జల్సా’ మిన‌హాయిస్తే) అన్ని చిత్రాల్లోనూ ఒక్క హీరోయినే ఉంటుంది.

అయితే.. ‘అత్తారింటికి దారేది’ నుంచి వ‌రుస‌గా ఇద్ద‌రు హీరోయిన్ల స‌బ్జెక్ట్‌ల‌ను డీల్ చేస్తున్నారు ఈ మాట‌ల మాంత్రికుడు. ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అఆ’, ‘అజ్ఞాతవాసి’ ఇవ‌న్నీ కూడా ఇద్దరు హీరోయిన్‌లు నటించిన చిత్రాలు కావడం విశేషం. అలాగే ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ కూడా ఇద్దరు హీరోయిన్‌ల స‌బ్జెక్ట్ కావ‌డం గ‌మ‌నార్హం. అందులో ఒకరు పూజా హెగ్డే కాగా.. మరో హీరోయిన్‌గా ఈషా రెబ్బా పేరు వినపడుతోంది. మొత్తానికి.. త్రివిక్ర‌మ్‌ ఇద్ద‌రు హీరోయిన్ల స‌బ్జెక్ట్‌తోనే వ‌రుస‌గా 5 చిత్రాలు చేస్తున్నార‌న్న‌మాట. మ‌రి.. ఇద్ద‌రు హీరోయిన్ల సినిమాల‌తో ఇప్ప‌టికే పలు హిట్స్ అందుకున్న త్రివిక్ర‌మ్.. ఈ చిత్రంతోనూ దాన్ని రిపీట్ చేస్తారేమో చూడాలి.

More News

విడుదలకు సిద్ధంగా లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన 'పరిచయం'

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైదరాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం "పరిచయం".

అనుతో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా - ర‌వితేజ‌

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

మే 26న హీరో సుధీర్‌ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

ప్రేమ‌ క‌థా చిత్రం , భ‌లే మంచి రోజు, కృష్ణ‌మ్మ‌ క‌లిపింది ఇద్ద‌రిని లాంటి విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో న‌టించిన‌ హీరో సుధీర్ బాబు

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్‌-కరుణాకరన్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం.

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.