ఈ సారి కూడా వదలని త్రివిక్రమ్

  • IndiaGlitz, [Wednesday,January 10 2018]

ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమా అంటే.. వినోదానికి చిరునామా. హీరో పాత్ర‌ల‌ని ఎంత బ‌లంగా తీర్చిదిద్దుకుంటారో.. హీరోయిన్ పాత్ర‌ల‌ని అంతే స‌ర‌దాగా డిజైన్ చేసుకుంటారు. తొలి రెండు చిత్రాలను మిన‌హాయిస్తే.. త‌న ప్ర‌తి సినిమాలోనూ హీరోయిన్ పాత్ర‌కి ఏదో ఒక లోపం (స‌మ‌స్య‌) ఉండేలా క్యారెక్ట‌ర్ డిజైన్ చేసుకోవ‌డం త్రివిక్ర‌మ్ అల‌వాటు.

జ‌ల్సాలో ఇలియానాని దృష్టి దోషం ఉన్న అమ్మాయిగా చూపించిన త్రివిక్ర‌మ్‌.. ఖ‌లేజాలో అనుష్కని న‌ష్ట‌జాత‌కురాలిగా చూపించారు. జులాయిలో ఇలియానాని క‌రువొచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లా ప్ర‌జెంట్ చేశారు. ఇక అత్తారింటికి దారేదిలో స‌మంత‌ని కాసేపు మ‌తిస్థిమితం ఉన్న అమ్మాయిలా చూపించిన త్రివిక్ర‌మ్‌.. అదే స‌మంత‌ని స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో బిపీ పేషంట్‌గా చూపించారు. ఇక అఆలో స్ట్ర‌స్ ఉన్న అమ్మాయిగా స‌మంత పాత్ర ఉంటుంది. ఇదే ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తూ.. అజ్ఞాత‌వాసిలోనూ రెండో క‌థానాయిక అను ఇమ్మాన్యుయేల్‌కి ఓసిడి ఉన్న అమ్మాయిగా చూపించాడు త్రివిక్ర‌మ్. మ‌రి రానున్న ఎన్టీఆర్ సినిమాలోనూ దీన్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

More News

నానికి జోడీగా రకుల్?

నేచురల్ స్టార్ నాని..పట్టిందల్లా బంగారమే అవుతోంది ఈ మధ్య.

ఎన్నారైగా రవితేజ

రాజా ది గ్రేట్లో అంధుడి పాత్రలో కనిపించి మెప్పించారు మాస్ మహారాజా రవితేజ.

'మనసుకు నచ్చింది' ట్రైలర్ అందరికీ నచ్చింది - దర్శకురాలు మంజుల ఘట్టమనేని

నటిగా,నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొని ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ మంజుల ఘట్టమనేని.

'కూనిరాగాలు' ఆవిష్కరించిన కళాతపస్వి కె.విశ్వనాధ్

కూనిరెడ్డి శ్రీనివాస్ రాసిన కవితా సంపుటి 'కూనిరాగాలు' ను కళాతపస్వి,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె.విశ్వనాధ్ ఆవిష్కరించారు.

26 ఏళ్ల 'చంటి'

చిన్నప్పట్నుంచి పాటలు,తల్లి,తల్లి ప్రేమ తప్ప మరేమీ తెలియని ఒక అమాయకుడికి..