Sandeep Reddy:త్రివిక్రమ్, బోయపాటి అందుకే నచ్చరు: సందీప్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్' టాక్ షో మూడో సీజన్ తాజా ఎపిసోడ్‌లో 'యానిమల్' టీమ్ సందడి చేసింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సినిమా విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య తెలుగు దర్శకుల్లో నచ్చే, నచ్చని విషయాలపై సందీప్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన సరదా సమాధానాలు ఇచ్చారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతమైన రచయిత.. తెలుగు భాషపై మంచి పట్టు ఉన్న దర్శకుడు.. కానీ ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ని తీసుకోవడం తనకు నచ్చదని తెలిపారు. ఇక ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గురించి అడగ్గా ప్రతి సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ దేవాలయాల్లోనే షూట్ చేయడం కూడా తనకు అంతగా నచ్చడం లేదని పేర్కొన్నారు. యానిమల్ మూవీ కథ గురించి చెబుతూ తండ్రీ-కొడుకుల సెంటిమెంట్‌తో దీనిని తీర్చిదిద్దామని.. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడు? అనేదే కథ అని సందీప్ చెప్పారు. ఇక ప్రభాస్‌తో తీయబోయే 'స్పిరిట్' సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఓ టాస్క్‌లో భాగంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కాల్ చేసి మాట్లాడారు. విజయ్ మాట్లాడుతుండగా.. 'స్పీకర్ ఆన్‌లో ఉంది' అని రష్మిక చెప్పడం ఆకట్టుకుంది. వెంటనే రణ్‌బీర్ ఫోన్ తీసుకుని ‘‘విజయ్.. మేము బాలకృష్ణ షోలో ఉన్నాం. స్క్రీన్‌పై ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ పోస్టర్లు చూపించి.. ఏ సినిమా అంటే ఇష్టమో రష్మికను చెప్పమన్నారు. ఆమె ఏం చెబుతుందో చూద్దాం’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మిక సమాధానమిస్తూ ‘‘అర్జున్‌రెడ్డి’తో నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్ వచ్చిన సమయంలో నేను చూసిన తొలిచిత్రం అదే. అలాగే ‘యానిమల్’ నేను వర్క్ చేసిన మూవీ. కాబట్టి రెండూ నాకు ఇష్టమైన చిత్రాలే’’ అని చెప్పుకొచ్చారు. తర్వాత రణ్‌బీర్ మాట్లాడుతూ.. విజయ్ వాళ్ల ఇంట్లో జరిగిన ‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్ పార్టీ గురించి చెబుతుండగా.. ఆ విషయాలు ఇక్కడ అవసరం లేదు కదా అని రష్మిక చెప్పడం నవ్వులు తెప్పించింది. ఇలా ఎపిసోడ్ మొత్తం సరదా సరదాగా సాగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments