'ఏబీసీడీ' కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది - త్రివిక్రమ్
- IndiaGlitz, [Monday,April 15 2019]
యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్టైనర్ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి' ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. సోమవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో త్రివికమ్ర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా... త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ''జల్సా' టైంలో నేను శిరీష్‌ను చిన్న కుర్రాడిగా చూశాను. నాకు తెలిసి సినిమాలపై అండర్స్టాండింగ్ ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో శిరీష్ కూడా ఒకరు. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. తను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. ఇద్దరు డబ్బున్నవాళ్లు వచ్చి కష్టాలు పడితే, మనకు చూడటానికి బాగా అనిపిస్తుంది. భరత్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. తను నటించిన వెంకీ, రెఢీ.. సినిమాల్లో తన క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేశాను. తనను ఇలా చూడటం నాకు ఫ్యాన్ మూమెంట్‌లా అపిస్తుంది. ఈ సినిమాలోని 'మెల్లమెల్లగా ..' సాంగ్ చూశాను. బాగా నచ్చింది.
ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపిస్తుంది. కాన్సెప్ట్ సినిమాలను తీసే మధుర శ్రీధర్‌గారికి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల సినిమాలు బాగా ఆడాలి. దాని వల్ల మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే మధురశ్రీధర్లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటూ ఆయనకు ఈ సినిమా చాలా డబ్బులు తెచ్చి పెట్టాలని కోరుకంటున్నాను. మే 17న 'ఏబీసీడీ' సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో అమెరికన్ దేశీ కన్ఫ్యూజ్ అయ్యాడేమో కానీ.. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా, సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. దర్శకుడు సంజీవ్‌గారు ఈ సినిమాను తొలి సినిమాలాగా కాకుండా చాలా బాగా తీశారు. ఈ సినిమా తనకు మంచి మెమొరీగా నిలవాలని, దర్శకుడిగా తను చాలా దూరం ప్రయాణించాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ - ''ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సినిమా గురించి ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా మా నిర్మాత మధురశ్రీధర్గారికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సురేష్‌బాబుగారికి, యష్గారికి కూడా థాంక్స్. నన్ను బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు సంజీవ్‌గారికి, మంచి మ్యూజిక్ అందించిన జుడో సాండీకి థాంక్స్. అలాగే అందరికీ థాంక్స్'' అన్నారు.
చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - ''సీరియస్ కాన్సెప్ట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసే నేను ఓ ఫన్ మూవీని ప్రొడ్యూస్ చేయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే 'ఏబీసీడీ'. శిరీష్, భరత్ ఫెంటాస్టిక్‌గా నటించారు. ఎఫ్2లో మనం ఫన్ను ఎంజాయ్ చేశాం. ఈ సమ్మర్లో రాబోయే ఈ సినిమా అలాగే ప్రేక్షకులనున ఎంజాయ్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. సురేష్ బాబుగారికి, యష్ రంగినేనిగారికి థాంక్స్'' అన్నారు.
చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - ''ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్‌గారే. ఆయన ఎప్పటికీ నా హీరోగానే ఉంటారు. అలాగే ఈ జర్నీలో ముందు నుండి భాగమై నాతో ట్రావెల్ చేస్తున్న నిర్మాత మధుర శ్రీధర్‌గారికి థాంక్స్ చెబితే తక్కువ అవుతుంది. యష్ రంగినేనిగారికి కూడా థాంక్స్. రుక్సర్ గారికి థాంక్స్'' అన్నారు.
నటుడు భరత్ మాట్లాడుతూ - ''కొన్నిసార్లు కొన్ని ఫీలింగ్స్ ఇతరులు అర్థం చేసుకోలేరు. కోట్ల రూపాయల మధ్య బ్రతికే ఇద్దరు వ్యక్తులు సాధారణ జీవితాన్ని ఎలా గడిపారని చెప్పేదే 'ఏబీసీడీ' మూవీ. బ్రతికేటప్పుడు ఎలా బ్రతుకుతున్నారు? ఎలా కష్టపడుతున్నారు? అనే విషయాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మలయాళ రీమేక్ అయితే తెలుగులో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేశారు. డైరెక్టర్ సంజీవ్‌గారు, హీరో అల్లు శిరీష్‌గారు నెటివిటీ పరంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసుకుంటూ వచ్చారు. మెల్లమెల్లగా సాంగ్ పెద్ద హిట్ అయ్యింది'' అన్నారు.
రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ - ''చాలా ఫన్, థ్రిల్లింగ్, ఎగ్జయిట్మెంట్ ఉండే సినిమా ఇది. దర్శకుడు సంజీవ్, నిర్మాతలు యష్గారు.. మధుర శ్రీధర్‌గారికి థాంక్స్. భరత్ మంచి కోస్టార్. శిరీష్ సెట్స్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. గ్రేట్ కోస్టార్ తను. మే 17న విడుదలవుతున్న ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నాను'' అన్నారు.