రజనీకాంత్ తో త్రిష....
Send us your feedback to audioarticles@vaarta.com
పా రంజిత్ తన దర్శకత్వంలో డాన్ క్యారెక్టర్‌లో రజనీకాంత్ నటించిన చిత్రం `కబాలి`. ఈ సినిమాలో రజనీకాంత్‌ను దర్శకుడు పా రంజిత్ ను సరికొత్తగా ప్రెజంట్ చేసినా ఆయనకున్న మాస్ ఇమేజ్‌ను సరిగ్గా రంజిత్ చూపించలేక పోయాడని ఫ్యాన్స్ బాధపడ్డారు, దర్శకుడిని విమర్శించారు కూడా. అయితే బాక్సాఫీస్ పరంగా సినిమా మంచి పలితాలనే రాబట్టుకుంది. కానీ పా రంజిత్ టేకింగ్ నచ్చడంతో రజనీకాంత్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 2.0 సినిమా తర్వాత రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ వండర్ బార్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లెటెస్ట్ కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తుందట. స్టార్ హీరోయిన్‌గా దశాబ్దానికి పైగా అనుభవమున్న త్రిష అందరి హీరోలతో సినిమా చేసింది. ఒక్క రజనీకాంత్‌తో తప్ప..సూపర్‌స్టార్‌తో పనిచేయాలనుందని త్రిష చాలా సార్లు తన మనసులో మాటను చెప్పుకుంది. మరి ఈ సినిమాతో ఆ కోరిక తీరాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments