ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడాలంటున్న త్రిష...
- IndiaGlitz, [Tuesday,March 15 2016]
ఇప్పుడు హీరోయిన్స్ అందరూ జంతువులపై ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. జంతువులకు సంబంధించిన స్వచ్చంద సంస్థలకు తమ వంతు మద్ధతును ప్రకటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉత్తరాఖండ్ కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ఒకరు గుర్రంపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే.
ఈ విషయంపై త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నిరసనను తెలియజేశారు. సదరు ఎమ్మెల్యేకు నరకంలో అయినా శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. మరి జంతు సంరక్షణ చట్టాలు అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఏ చర్యలకు పాల్పడుతాయో తెలియాంటే వెయిట్ చేయాల్సిందే...