డాక్టర్ పాత్రలో త్రిష
- IndiaGlitz, [Friday,October 13 2017]
డస్కీబ్యూటీ త్రిష చేతి నిండా ఆఫర్స్‌తో బిజీగా ఉంది. మూడు పదుల వయసులోనూ గ్లామర్‌తో కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తుంది. ప్రస్తుతం ఆర డజను సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు కాకుండా మరో కొత్త సినిమాను త్రిష ఒప్పుకుందట.
వివరాల్లోకెళ్తే..తెలుగు, తమిళంలో విడుదలయ్యేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈసినిమాలో త్రిష డాక్టర్ పాత్రలో కనపడనుందట. దశాబ్ద కాలంపైగా అనుభవమున్న త్రిష, డాక్టర్‌గా చేస్తున్న సినిమా ఇదే. అలాగే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. త్వరలోనే సినిమా సెట్స్‌లోకి వెళ్లనుంది.