త్రిష బాటలో తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
పదేళ్లకి పైగా హీరోయిన్లుగా రాణిస్తున్న వైనం అందాల తారలు త్రిష, తమన్నా సొంతం. తమన్నా కంటే ముందు త్రిష కెరీర్ ని ప్రారంభించినా.. ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు కాస్త అటుఇటుగానే అడుగులు వేస్తున్నారు.
అదేమిటంటే.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం. త్రిష తెలుగు, తమిళ భాషల్లో 'నాయకి' అనే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది. హిందీలోనూ ఈ సినిమాకి క్రేజ్ రావడంతో అక్కడా డబ్బింగ్ రూపంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే.. త్రిష హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ షూటింగ్ పూర్తిచేసుకున్నాక తమన్నా కి సంబంధించిన సినిమా ఒకటి వార్తల్లోకి వచ్చింది. తెలుగులో 'అభినేత్రి'.. తమిళంలో 'కాంత'గా రూపొందుతున్న ఈ సినిమా హిందీలోనూ తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్‌కి ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొత్తమ్మీద.. హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో త్రిష, తమన్నా చేస్తున్న మొదటి చిత్రాలే.. త్రిభాషల్లో విడుదలవడం విశేషంగా చెప్పుకోవాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com