బ్రేక్ తీసుకున్న త్రిష
Send us your feedback to audioarticles@vaarta.com
డస్కీ బ్యూటీ త్రిష బ్రేక్ తీసుకోవాలనుకుంటుది. అసలు ఇంతకూ త్రిష ఎందుకు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుంది? అనే విషయానికి వస్తే.. సోషల్ మీడియా నుండి త్రిష గ్యాప్ తీసుకోవాలనుకుంది. ఈ విషయాన్నికూడా ఆమె సోషల్ మీడియా ద్వారానే తెలియజేసింది. ‘‘నా చుట్టూ జరుగుతున్న విషయాల గురించి నేను కొన్ని రోజుల పాటు తెలుసుకోవాలని అనుకోవడం లేదు. మైండ్‌కు ఇదొక డిజిటల్ చికిత్సలాంటిది. ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి. లవ్ యు గయ్స్.. మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్విట్టర్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇలా త్రిష బ్రేక్ ఎందుకు తీసుకోవాలనుకుంది? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే త్రిష మూడు పదులు దాటినా గ్లామర్ విషయంలో పోటీ పడుతుంది. వరుస అవకాశాలను అందుకుంటుంది. లాక్‌డౌన్ సమయంలో శింబుతో కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయ సినిమాకు సీక్వెల్‌గా లఘు చిత్రంలో నటించింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న పొన్నియన్ సెల్వన్‌లోనూ నటిస్తుంది. మరో ఐదు చిత్రాలు చేయాల్సి ఉంది. తెలుగులో చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించాల్సి ఉన్నది కానీ.. కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com