త్రిష సన్నబడుతుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
అవును అల్రెడి సన్నగా ఉండే చెన్నై సొగసరి త్రిష మళ్ళీ సన్నబడటానికి ప్రయత్నిస్తుంది. ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన సోయగం తగ్గని ఈ సొగసరి ఇప్పుడు గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం నాయకి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష రెండు పాత్రల్లో కనపడుతుంది. అందులో ఒక రోల్ కోసం బరువు తగ్గాల్సిన అవసరం ఉండటంతో త్రిష పాత్ర కోసం ఐదు కేజీల బరువు తగ్గింది. ఈ సినిమా కోసం త్రిష పడుతున్న కష్టాన్ని చూసిన యూనిట్ సభ్యులు త్రిష సైజ్ జీరో కోసం కష్టపడుతుందేమోనని కూడా గుసగుసలాడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments