శింబుతో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమవుతున్న త్రిష!
Send us your feedback to audioarticles@vaarta.com
అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది త్రిష. దాదాపు 40కి చేరవవుతున్న అమ్మడు మాత్రం యంగ్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు తాజాగా త్రిష పెళ్లి గురించి ఓ న్యూస్ కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. అమ్మడు సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కబోతోందట. ఈ విషయాన్ని కోలీవుడ్ వర్గాలే వెల్లడిస్తున్నాయి. వరుడు ఎవరో కాదు.. టి.రాజేందర్ కుమారుడు శింబు. వివాదాలకు ఎప్పుడూ చాలా దగ్గరగా ఉంటాడు.
అయితే త్రిష-శింబు కాంబోలో 'విన్నైతాండి వరువాయ' (తెలుగులో ఏమాయ చేశామే), అలై చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ‘విన్నైతాండి వరువాయ’ చిత్రం సీక్వెల్‌కు సిద్ధమవుతోంది. దీనిలోనూ త్రిష-శింబూ కాంబోనే రిపీట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పెళ్లి వార్త కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై త్రిష లేదంటే శింబు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com