ఎక్స్‌క్లూజివ్: చిరు సినిమా నుంచి తప్పుకున్న త్రిష

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా విజయంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే చిరు సరసన కథానాయిక ఎవరనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా.. అనుష్క, కాజల్‌, నయనతార, త్రిష ఇలా చాలా మంది పేర్లు పరిశీలించడం జరిగింది. ఫైనల్‌గా త్రిషనే తీసుకున్నారు. అయితే.. తాను ఈ చిత్రంలో చేయట్లేదని.. వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించింది.

మరో సినిమాతో వస్తా!

సినిమాలో చేయమని అడిగేటప్పుడు చెప్పిన కథకు.. షూటింగ్‌లో దిగిన తర్వాత చేసే చిత్రీకరణకు చాలా డిఫరెన్స్ ఉంటుందన్నట్లుగా త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అంటే కథ ఒకటి చెప్పి మరొకటి షూట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె వెల్లడించిందన్న మాట. ‘నేను చిరంజీవి సినిమాలో చేయట్లేదు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. నా ప్రియమైన అభిమానులారా త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను’ అని త్రిష ట్విట్టర్‌లో వెల్లడించింది.

కాజల్ ఫిక్సయ్యిందా!?

ఇదిలా ఉంటే.. త్రిష స్థానంలో కాజల్‌ను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే చిరు సరసన ఖైదీ నంబర్-150లో కాజల్ నటించి మెప్పించింది. కొరటాల దర్శకత్వంలో కూడా ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ‘జనతా గ్యారేజ్’ మూవీలో ‘పక్కా లోకల్..’ అంటూ అదరగొట్టేసింది. ఇటీవలే అల్లరి నరేష్ సినిమాలో కాజల్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. తాజాగా చిరు సినిమాలో బంపరాఫర్ రావడంతో ఆ చిత్రాన్ని వదులుకోవాలని కూడా ఆ బ్యూటీ భావిస్తోందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

More News

జగన్ కేబినెట్‌లో రోజా, ఆళ్లకు నో ఛాన్స్.. ఆ ఇద్దరు వీళ్లే..!

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ రిలీజ్ డేట్ ఖ‌రారు

సినిమా చరిత్రలో హిట్స్‌, సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్‌ మూవీస్‌ మాత్రం అరుదుగానే వస్తుంటాయి.

RRRలో ఈ సీన్స్ కోసం 85 కోట్ల బడ్జెట్!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’.

టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో చంద్రబాబు సన్నిహితుడు!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

బలపరీక్షకు సై అంటున్న కమల్‌నాథ

మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రానికి కీలకనేత, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో