పెళ్లిపై త్రిష ఇంత మాట అనేసిందేంటి!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన చెన్నై పొన్ను, దక్షిణాది స్లిమ్ బ్యూటీ త్రిషను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు. కొందరు హీరోల సరసన త్రిష తప్ప మరొక్కరు సెట్ కారనేంత రేంజ్లో ఈ ముద్దుగుమ్మ గుర్తింపు సంపాదించుకుంది. అప్పట్లో ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగేకాదు.. టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. అయితే.. ఆ తర్వాత వరుస అవకాశాలు తగ్గిపోవడంతో ఈ అందాల భామ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఏం జరిగిందో ఏమోగానీ.. పెళ్లి పీటలదాకా వెళ్తుందనుకున్న సమయానికి అది కాస్త పెటాకులైంది. దీంతో నాటి నుంచి నేటి వరకూ పెళ్లి అంటే చాలు చిరాకెత్తేలా ఈ బ్యూటీ మాట్లాడేస్తోంది.
సోషల్ మీడియా ద్వారా అభిమానులు, నెటిజన్లకు బాగా టచ్‌లో ఉండే త్రిష.. తాజాగా నెట్టింట్లో ఓ వీరాభిమాని పెళ్లి గురించి అడగ్గా... ఆసక్తికరంగా సమాధానిమచ్చింది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదుని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని ఆమె తనకు నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్‌లోనే చేసుకుంటానని మనసులోని మాటను బయటపెట్టింది. అయితే ఇలా వేగాస్‌లో పెళ్లి చేసుకోవడం అంటే త్రిష డ్రీమ్ లిస్ట్‌లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని చెబుతోంది. ఆమె చెప్పిన సమాధానానికి పలువురు నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరి నచ్చిన మగాడు ఈ బ్యూటీకి ఎప్పుడు దొరుకుతాడో.. పెళ్లి ఎప్పుడవుతుందో.. కల ఎప్పుడు నెరవేరుతుందో..!. కాగా.. ప్రస్తుతం మూడు సినిమాలో ఈ స్లిమ్ బ్యూటీ బిజిబిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది. అంతేకాదు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన ఈ ముద్దుగుమ్మ నటించబోతోంది. ఇప్పటికే చిరు-త్రిష ఇద్దరూ ‘స్టాలిన్’ మూవీలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments