సీక్వెల్‌లో త్రిష చేయడం లేదు...
Send us your feedback to audioarticles@vaarta.com
2003లో హరి దర్శకత్వంలో విడుదలైన తమిళ చిత్రం 'సామి' అందరికీ గుర్తుండే ఉంటుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ నటన అందరినీ మెప్పించింది. ఈ చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా లక్ష్మీ నరసింహా అనే పేరుతో రీమేక్ కూడా చేశారు. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ సామి 2 నిర్మితమవుతుంది.
ఈ సినిమాలో కొనసాగింపుగా విక్రమ్, త్రిషలతో పాటు కీర్తి సురేష్ కూడా నటించనుందని యూనిట్ తెలియజేసింది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ నుండి త్రిష తప్పుకుంది. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. క్రియేటివ్ డిఫరెన్‌సెస్ కారణంగానే సినిమా నుండి తప్పుకుంటున్నట్లు త్రిష తెలియజేయడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com