త్రిష 'నాయకి' కి ఇబ్బందులు తప్పవా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకులకి నాయకి త్రిష పన్నెండేళ్లుగా సుపరిచితం. కెరీర్ ప్రారంభంలో మంచి క్రేజ్‌ని మూటగట్టుకున్నా.. ఓ స్థాయి తరువాత ఆ క్రేజ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ మునుపటి హవా కొనసాగించేందుకు త్రిష ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోందీ చెన్నై పొన్ను. 'నాయకి' అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది.
హిందీలోనూ డబ్బింగ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ తేదికి రావడం అంటే కాస్త రిస్కే. ఎందుకంటే.. ఈ నెల 22న అల్లు అర్జున్ 'సరైనోడు' విడుదల కాబోతుంటే.. మే 6న త్రివిక్రమ్ 'అ..ఆ..' రానుంది. రెండు పెద్ద సినిమాల మధ్య దొరికే గ్యాప్‌లో.. చిన్న సినిమాలన్నీ దండెత్తి వస్తాయి కాబట్టి 'నాయకి'కి సోలో రిలీజ్ స్కోప్ ఉండదు. పైపెచ్చు ఆ రెండు సినిమాల మధ్య ఫలితం పరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి.. 'నాయకి' భవితవ్యం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com