ఈనెల 5న 'త్రిష లేదా నయనతార'
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో సంచలన విజయం సాధించిన త్రిష లేదా నయనతార చిత్రం ఈ నెల 5న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు 300 ల థియేటర్లో విడుదల కానుంది. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా ఈరోజుల్లో, బస్టాఫ్ చిత్రాలతో సక్సెస్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆనందిని (రక్షిత) హీరోయిన్ గా, బెంగుళూరు మోడల్ మనీషా యాదవ్ మరో హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో కామియో ఫిలింస్, రిషి మీడియా సంస్థలు సంయుక్తంగా త్రిష లేదా నయనతార చిత్రాన్ని రూపొందించాయి.
ఈ చిత్రం ద్వారా తెలుగులోను జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ పబ్లిసిటీతో రుషి మీడియా అధినేత క్రిష్ణ విడుదల చేస్తున్నారు. ఆయన చిత్ర వివరాలు తెలియచేస్తూ..హీరో జి.విప్రకాష్ కుమార్ సంగీత సారధ్యంలోనే రూపొందిన అద్భుతమైన సంగీత బాణీలకు ప్రముఖ గేయ రచయితలు రామ జోగయ్యశాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. మాస్ ని విపరీతంగా ఆకట్టుకునేలా ఈ పాటలను చిత్రీకరించారు. సిమ్రాన్ ఈ చిత్రంలో ప్రాధాన్యత గల లీడ్ రోల్ చేసింది. హీరో ఆర్య, హీరోయిన్ ప్రియానంద్ గెస్ట్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 5న భారీ పబ్లిసిటీతో దాదాపు 300 ధియేటర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com