కల్ట్ లవ్ స్టోరిగా 'త్రిష లేదా నయనతార'
Send us your feedback to audioarticles@vaarta.com
స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్‌రాజా సారథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం త్రిష ఇళ్ళై నయనతార`. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆనందిని, మనీషా యాదవ్ హీరోయిన్లు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని త్రిష లేదా నయనతార` పేరుతో రుషి మీడియా బ్యానర్‌పై కృష్ణ, రమేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్, హీరోయిన్ ఆనందిని, ఎస్.వి.ఆర్.మీడియా అధినేత్రి సి.జె.శోభ, బెక్కం వేణుగోపాల్, టి.ప్రసన్నకుమార్, సి.జె.జయకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్, రుషి మీడియా కృష్ణ, మిణుగురులు` ఫేమ్ ఆయోధ్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం యూత్ ఫీలింగ్స్‌ను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. తమిళంలో ఈ చిత్రం నాకు రెండో సినిమా కాగా తెలుగులో మొదటి సినిమా. ఇందులో బాయ్ నెక్స్ట్ డోర్ జీవా అనే పాత్ర చేశాను. తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నాను. రెండు సాంగ్స్ కూడా పాడానని జి.వి.ప్రకాష్ అన్నారు.
బోల్డ్ మూవీ. మంచి యూత్‌ఫుల్ మూవీ. అందరకి బాగా కనెక్ట్ అవుతుంది. తమిళంలాగానే తెలుగులో కూడా సినిమా పెద్ద హిట్ అవుతుందని హీరోయిన్ ఆనందిని అన్నారు. ఈ సినిమా తమిళంలో సెప్టెంబర్‌లో రిలీజై అక్కడ 20 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సాధించింది. ఇదొక కల్ట్ రొమాంటిక్ లవ్‌స్టోరీ. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని సి.జె.జయకుమార్ తెలిపారు. జి.వి.ప్రకాష్‌తో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని నిర్మాతలకు ప్రసన్నకుమార్ సలహానిచ్చారు. జి.వి.ప్రకాష్ చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్సులు చేశాడని, సాంగ్స్, ట్రైలర్ బావున్నాయని తమిళంలో సినిమా హిట్టయిన విధంగానే తెలుగులో కూడా పెద్ద విజయం సాధించాలని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్‌ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments