త్రిష సంక్రాంతి పోటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న తార త్రిష ఇప్పుడు 'మోహిని' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. రీసెంట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ జనవరికి విడుదల కానుంది.
ఈ సినిమాను తమిళంలో జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలోని విక్రమ్,సూర్య, ప్రభుదేవా వంటి స్టార్స్ సినిమాలున్నాయి.
జాకీ భగ్నాని, సురేష్, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకి వివేక్, మెర్విన్ సంగీతాన్ని అందించారు. రమణా మాదేష్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి తెలుగులో ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments