చిరుకు నో చెప్పి.. రవితేజకు త్రిష గ్రీన్ సిగ్నల్!?
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి త్రిష తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నటించి చాలా రోజులైంది. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. అప్పట్లో అందరూ ఆలస్యమైనా బంపరాఫర్ కొట్టేసిందని.. మరోసారి హిట్ జోడి వస్తోందని ఇలా రకరకాలు మాట్లాడేసుకున్నారు. అయితే ఏవేవో సాకులు చెప్పిన ఈ బ్యూటీ సినిమా చేయట్లేదని తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. అయితే తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయంతో అటు మెగాభిమానులు, ఇటు టాలీవుడ్ సినీ ప్రియులు షాకవుతున్నారు.
కారణమేంటి..!?
ఇందుకు కారణం చిరుకు నో చెప్పి మాస్ మహారాజ్ రవితేజకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇటీవల రవితేజ సినిమాలో నటించాలని దర్శకనిర్మాతలు సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో హీరోయిన్గా అడగ్గా.. ఆ బ్యూటీ ఒప్పేసుకుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త అటు నెట్టింట్లో.. ఇటు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. చిరు నో చెప్పడమేంటి..? రవితేజకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటి..? త్రిష ఎందుకిలా చేస్తోంది..? అని అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారట. మరి దీనిపై చిత్రబృందం కానీ.. త్రిష కానీ క్లారిటీ ఇస్తే వ్యవహారం కొలిక్కి వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com