వివ‌ర‌ణ ఇచ్చుకున్న త్రిష‌...

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త్రిష‌..విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' లో నుండి త‌ప్ప‌కుంది. అస‌లు త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నే దానిపై త్రిష త‌న పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్యత సీక్వెల్‌లో లేద‌ని తెలియ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

దీంతో నిర్మాత‌ల మండ‌లిలో త్రిష‌పై పిర్యాదు చేశారు చిత్ర నిర్మాత‌లు. అయితే తాను సావి స్క్వేర్‌లో ఒక సీన్‌లో కూడా న‌టించ‌లేదు కాబ‌ట్టి త‌న‌కు సినిమా నుండి త‌ప్పుకునే హక్కు ఉంద‌ని నిర్మాత మండ‌లికి స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే ఈ సీక్వెల్‌లో న‌టించ‌డానికి త్రిష‌ను ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ బుజ్జ‌గింపుల‌కైనా త్రిష ఒప్పుకుంటుందేమో చూడాలి.