మహేష్ బాబు బాటలో త్రిష..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌బాబు పక్కన అతడు, సైనికుడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన చెన్నై సుందరి త్రిష.. ఇప్పుడు ఓ విషయంలో మహేష్ రూట్‌లో వెళ్లిపోయింది. ఇంతకీ అదేమిటంటే.. ఈ మధ్యే మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో 4మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంటే.. ఇప్పుడీ 4మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న జాబితాలో త్రిష కూడా చేరింది.
అయితే, మహేష్ కంటే ముందు ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసింది త్రిష. జులై 2009లో త్రిష ట్విట్టర్ అకౌంట్‌లో చేరితే.. ఏప్రిల్ 2010లో మహేష్ చేరాడు. ఇక మహేష్ ఒకర్నే ఫాలో అవుతుంటే.. త్రిష 149 మందిని ఫాలో అవుతోంది. ఇదిలా ఉంటే.. నాయకి తరువాత మరో తెలుగు చిత్రం అంగీకరించని త్రిష.. తమిళంలో మాత్రం ఆరు చిత్రాలతో బిజీగా ఉంది.వీటిలో అరవింద్ స్వామితో కలిసి నటించిన చదురంగ వేట్టై2 అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాపై త్రిష భారీ ఆశలనే పెట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com