అప్పటి వరకూ సింగిలే..: త్రిష
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన త్రిష పెళ్లిపై గత కొంతకాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఇటు తెలుగు, అటు తమిళ భాషలకు చెందిన ప్రేక్షక లోకాన్ని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 37 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి ఊసే ఎత్తట్లేదు. దీంతో ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆమెకు ఈ ప్రశ్న ఎదరవుతూనే ఉంది. అయితే గతంలో ఈ బ్యూటీ ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం వరకూ వెళ్లింది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ పెళ్లి నిశ్చితార్థంతోనే ఆగిపోయింది.
ఆ తర్వాత త్రిష కెరీర్‌పై దృష్టి పెట్టింది. అయినప్పటికీ ఆమె పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరో శింబుతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందని బాగా రూమర్స్ నడిచాయి. సీక్రెట్‌గా శింబు, త్రిషల పెళ్లి జరగబోతోందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా తన పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో త్రిష స్పందించింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుంటానని త్రిష చెప్పింది. అప్పటి వరకూ సింగిల్‌గానే ఉంటానని వెల్లడించింది. అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తానని త్రిష స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments