అప్పటి వరకూ సింగిలే..: త్రిష

  • IndiaGlitz, [Tuesday,November 17 2020]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన త్రిష పెళ్లిపై గత కొంతకాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఇటు తెలుగు, అటు తమిళ భాషలకు చెందిన ప్రేక్షక లోకాన్ని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 37 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి ఊసే ఎత్తట్లేదు. దీంతో ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆమెకు ఈ ప్రశ్న ఎదరవుతూనే ఉంది. అయితే గతంలో ఈ బ్యూటీ ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం వరకూ వెళ్లింది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ పెళ్లి నిశ్చితార్థంతోనే ఆగిపోయింది.

ఆ తర్వాత త్రిష కెరీర్‌పై దృష్టి పెట్టింది. అయినప్పటికీ ఆమె పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరో శింబుతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందని బాగా రూమర్స్ నడిచాయి. సీక్రెట్‌గా శింబు, త్రిషల పెళ్లి జరగబోతోందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా తన పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో త్రిష స్పందించింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుంటానని త్రిష చెప్పింది. అప్పటి వరకూ సింగిల్‌గానే ఉంటానని వెల్లడించింది. అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తానని త్రిష స్పష్టం చేసింది.

More News

‘రౌడీ బేబి..’ రికార్డ్‌..!

‘రౌడీ బేబి ...’ అంటూ సాంగ్‌తో ధనుశ్‌, సాయిప‌ల్ల‌వి వెండితెర‌పై చేసిన సంద‌డిని అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేం.

డిసెంబర్ 6న జీహెచ్ఎంసీ ఎన్నికలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఆ చిత్రాన్ని పవన్ సర్ చేయడం చాలా ఆనందాన్నిస్తోంది: చిన్మయి

తానొక సందేశాత్మక చిత్రాన్ని చూశానని.. అది తనకు ఎంతగానో నచ్చిందని సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకారం..

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆది సాయికుమార్ హీరోగా ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై