విలన్ గా త్రిష....
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ సినిమాలతో అలరించిన హీరోయిన్ త్రిష ఇప్పుడు సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ సాగిపోతుంది. ఇప్పుడు విలక్షణమైన చిత్రాలను చేస్తుంది. బోగి సినిమాతో పాటు హర్రర్ కామెడి చిత్రం నాయకి కళావతి(అరన్మణి2) చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలతో పాటు మరో విలక్షణమైన పాత్రలో నటించడానికి త్రిష సిద్దమైంది. అదే నెగటిల్ రోల్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందుతోన్న పొలిటికల్ ఎంటర్ టైనర్ కొడి చిత్రాన్ని దురై సెంథిల్ డైరెక్ట్ చేస్తున్నారు. సమకాలీన రాజకీయాల ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఈ చిత్రంలో కొంతమంది మహిళా రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని నెగిటివ్, పాజిటివ్ షేడ్స్ తో ఉండేలా త్రిష పాత్ర సాగుతుందట. ఈ సినిమాలో మరో త్రిషను చూస్తారని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments