పాటల చిత్రీకరణలో 'త్రిపుర'
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతి టైటిల్ రోల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'. తెలుగు, తమిళ ('తిరుపర సుందరి') భాషల్లో ఏకకాలంలో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. త్వరలో పాటల చిత్రీకరణ ఆరంభం కానుంది. ఈ పాటలను బెంగళూరులోని హంపీ, బదామీలో చిత్రీకరించనున్నారు.
ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ - "ప్లాన్ చేసిన ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. అవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అవుట్ పుట్ సంతృప్తికరంగా ఉంది. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ చిత్రంలో స్వాతి నటన హైలైట్ గా నిలుస్తుంది'' అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ - ''పూర్తయినంతవరకు రషెస్ చూశాం. చాలా బాగా వచ్చింది. స్వామి రారా, కార్తికేయ విజయాల తర్వాత స్వాతి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో స్వాతి హ్యాట్రిక్ సాధించడం ఖాయం. సినిమా అంత బాగా వచ్చింది. 'గీతాంజలి'కన్నా అద్భుతంగా వచ్చింది. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. ఇందులో ఆయనది ఫల్ లెంగ్త్ రోల్. ఆ పాత్రకు సంబంధించిన చిత్రీకరణకు 25 రోజులు పట్టింది. పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గ ఎంటర్ టైనర్ ఇది`` అన్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments