శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం తిరుపతికి వచ్చిన ఆయన నేరుగా తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులు సాదర స్వాగతం తెలిపారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశ్వీరచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడాదరు.
తిరుమల శ్రీవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయమంతా కుళ్లు, కుతంత్రాలు, అవినీతిమయమని ఆరోపించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచి నేటి వరకు ఆయన అనుసరిస్తున్న రాజకీయాలన్నీ అపవిత్రమన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇక శ్రీవారిని భారత బ్యాట్మెంటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సినీనటుడు రాజేంద్రప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనంతో పాటు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments