షేక్ హ్యాండిచ్చి.. వైఎస్ షర్మిల ఉంగరం కొట్టోయబోయాడు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున బహిరంగ సభలు, రోడ్డు షోలతో పార్టీల నేతలు ముందుకెళ్తున్నారు. అయితే దీన్నే అదనుగా తీసుకొని కొందరు దొంగలు చేతివాటం చూపిస్తున్నారు.
ఇప్పటికే పలు బహిరంగ సభల్లో మాది మొబైల్ పోయింది.. పర్సు పోయింది.. ఇలా పలువురు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని మనం వార్తలు వినే వుంటాం. ఇటీవలే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు పూలదండ వేస్తున్నట్లు నటించి గోల్డ్ చైన్ లాగేసి.. టోపి పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన ఆమె బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కొందరు పార్టీ కార్యకర్తలు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు.
అయితే కొందరు కార్యకర్తల ఉత్సాహం చూసి ఆమె బస్సులో నుంచే చేయి అందిస్తూ.. ఇదే అదనుగా ఓ దొంగ షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని లాగేసేందుకు యత్నించాడు. అయితే అప్రమత్తమైన షర్మిల తన చేతిని వెనక్కి లాక్కున్నారు.
ఉంగరం బిగుతుగా ఉండటంతో చేతి నుంచి ఊడిరాలేదు. ఈ మొత్తం తతంగాన్ని ఓ కార్యకర్త తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు అటు నేతలు.. ఇటు కార్యకర్తలు ప్రచారంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments