SuperStar Krishna : సూపర్‌స్టార్ కృష్ణకు సంతాపం.. ఆ జిల్లా వ్యాప్తంగా మార్నింగ్ షో క్యాన్సిల్
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ.. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు కృష్ణ మృతికి సంతాప సూచికంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్‌లలో ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబ్యూటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కృష్ణ మృతి పట్ల నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది. సూపర్‌స్టార్‌కు సంతాప సూచికంగా గురువారం షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
అనారోగ్యంతో దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు :
కాగా.. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో వున్నారు. అయితే వైద్యులు సీపీఆర్ చేసి కృష్ణను కాపాడారు. నాటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయిన మహేశ్‌ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. కృష్ణ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. విజయ నిర్మల, రమేశ్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మరణాలతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా మహేశ్ బాబును ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments