హైపర్ ఫస్ట్ సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను బుధవారం విడుదల చేశారు.
ఈ పాటకు వస్తోన్న రెస్పాన్స్ గురించి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ....ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశాం. అన్నిచోట్ల నుంచి ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. జిబ్రాన్ చాలా ఎక్స్లెంట్ మ్యూజిక్ చేశారు. మొదటి పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అవుతుందన్న మా నమ్మకం రెట్టింపు అయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈనెల 30న దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్వాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com