చిరు సాంగ్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియ‌స్ 150వ చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' శ‌ర‌వేగంగా సంక్రాంతి బ‌రిలో రావ‌డానికి స‌మాయ‌త్తం అవుతుంది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను పెంచేలా బాస్ ఈజ్ బ్యాక్ లైన్‌తో ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్‌గా చిరు డ్యాన్స్ చేసి అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సాంగ్‌కు మెగాభిమానులు, ప్రేక్ష‌కులు మంచి స్పంద‌న‌ను చూపుతున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్‌లో సంచ‌నాల‌కు క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే సాంగ్ వ్యూవ‌ర్స్ 5 మిలియ‌న్స్‌కు చేరుకున్నారు. ఈరోజు మ‌రో సింగిల్ ట్రాక్ విడుద‌ల కానుంది.