మీ ఇంట్లో మనిషిగా గుర్తించండి.. ఒక్క ఫోన్ కాల్‌తో..!

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అన్నీ తీసేస్తాడంటూ టీడీపీ నాయ‌కులు దుష్ప్రచారం చేస్తున్నారు... మాకు అండ‌గా ఉన్న ఆడ‌ప‌డుచుల‌కు ఇప్పుడున్న స‌ర్కారు చేస్తున్న దానికి మించి చేస్తామ‌ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. డ్వాక్రా సంఘాల లీడ‌ర్స్‌, రిసోర్స్ ప‌ర్సన్స్‌ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, జూనియ‌ర్ క్లర్క్ స్థాయి జీతాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. బ్యాంకు అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌న్నారు. ఆడ‌ప‌డుచుల‌ను దేశ నిర్మాణం కోసం మిన‌హా పార్టీ అవ‌స‌రాల‌కు వినియోగించే ప్ర‌స‌క్తే లేద‌ని తెలిపారు. గురువారం గాజువాక అక్కిరెడ్డిపాలెంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా ప్రజ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చిన 45 రోజుల్లో గాజువాక అభివృద్దికి సంబంధించి ఓ మాస్టర్ ప్లాన్‌కి రూప‌క‌ల్పన చేసి మీ ముందు ఉంచుతాం. ఏ స్థలాన్ని ఎలా వినియోగించాలి. ఎక్కడ ఆట స్థలాలు ఉండాలి. ఎక్కడ గృహ స‌ముదాయాలు ఉండాలి అనే అంశాల‌ను ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుప‌రుస్తాం. గాజువాక ఓ మినీ ఇండియా. అన్ని ర‌కాల కులాలు, మ‌తాల ప్రజ‌లు ఇక్కడ ఉంటారు. అలాంటి గాజువాక‌ను ఓ మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దుతాం. ఆ మోడ‌ల్ దేశం మొత్తం వెళ్లాల‌న్నదే నా ఆకాంక్ష. ప్రతి వార్డు నుంచి 12 మంది యువ‌త‌కు ఎమ్మెల్యే కార్యాల‌యం నుంచి ఉద్యోగాలు ఇచ్చి, అక్కడ ఉన్న స‌మ‌స్యల‌ను ఎప్పటికప్పుడు మానిట‌రింగ్ చేస్తా. అన్ని త‌ర‌గ‌తుల ప్రజ‌ల అవ‌స‌రాలు తీరుస్తాను అని పవన్ హామీ ఇచ్చారు.

నన్ను మీ ఇంట్లో మనిషిగా గుర్తించండి

హామీలు చూసి న‌న్ను అంద‌రిలాంటి రాజ‌కీయ నాయకుడిగా భావించ‌వ‌ద్దు. మీ ఇంట్లో మ‌నిషిగా గుర్తిస్తే చాలు. 60 సంవ‌త్సరాలు నిండిన జ‌ర్నలిస్టుల‌కు రూ. 8 వేల పెన్షన్ ఇస్తాం. గృహ స‌దుపాయం క‌ల్పిస్తాం. స్పెష‌ల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్‌కు పెన్షన్‌తోపాటు ఇళ్ల నిర్మాణం, ఉపాధి క‌ల్పించే బాధ్యత‌ను జ‌న‌సేన ప్రభుత్వం తీసుకుంటుంది. వ‌య‌సు మ‌ళ్లిన పెద్దల కోసం ఆదరణ నిల‌యాలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌కు రూ.500 ఎక్కువే మీకు చేరేలా చూస్తాం. ఈ ఆదరణ నిల‌యాల వ‌ల్ల మ‌రో ప‌ది మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. బ‌య‌టికి వెళ్లి మందులు తెచ్చుకోలేని పెద్ద‌ల‌కు ఒక్క ఫోన్ కాల్‌తో మందులు డోర్ డెలివ‌రీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం అని పవన్ చెప్పుకొచ్చారు.

More News

జగన్‌ను ఎలా నమ్మాలి.. అలీని వైసీపీలోకి ఎందుకు తీసున్నావ్!?

వైఎస్ఆర్సీపీ నాయ‌కుల‌కు జ‌న‌సేన పార్టీ అంటే అసూయ‌ అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి నిజాయ‌తీప‌రుల‌ను పార్టీలోకి

మే 17న అల్లు శిరీష్ 'ABCD' గ్రాండ్ రిలీజ్‌

యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్  'ABCD'.

21వ కళాసుధ ఉగాది అవార్డుల వేడుక

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతొ అవార్డులు అందించనున్నారు.

ఏపీ ఎన్నికల్లో నా దైవాన్ని గెలిపించండి!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భక్తుడన్న విషయం తెలిసిందే. అయితే ఇది సినిమాల వరకే అని రాజకీయాల పరంగా

టీడీపీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఐటీ!

ఐటీ అధికారులు మామూలు రోజుల్లోనే అవినీతి తిమింగలాలపై ఉక్కుపాదం మోపుతుంటారు. ఇక ఫిర్యాదులు వస్తే మాత్రం వారిని వదిలిపెట్టరు.