సమంత అభిమానులకి పండగే
Send us your feedback to audioarticles@vaarta.com
అక్టోబర్ 2017.. సమంతకి, ఆమె అభిమానులకి వెరీ స్పెషల్. ఎందుకంటే.. ఆ నెల ఆరో తేదిన యువ కథానాయకుడు నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుంది సమంత. ఒక వారం తరువాత అంటే.. అక్టోబర్ 13న తన కాబోయే మావయ్య అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది2 విడుదల కాబోతోంది.
అంతేకాకుండా.. తమిళంలో తనకు రెండు సార్లు హిట్ ఇచ్చిన విజయ్‌తో కలిసి నటించిన మెర్సల్ చిత్రం అదిరింది పేరుతో ఇక్కడా అదే నెలలో రిలీజ్ కాబోతోంది. అలాగే తమిళంలో తను ద్విపాత్రాభినయం చేసిన 10 ఎండ్రతుకుల్ల సినిమా తెలుగులో 10 పేరుతో అదే నెలలో విడుదల కాబోతోంది. సో.. జీవితంలో కీలక ఘట్టమైన పరిణయంతో పాటు మూడు సినిమాలు అక్టోబర్ నెలలోనే రావడం అనేది సమంతకే కాదు ఆమె అభిమానులకీ పండగేనన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com