కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ముంబై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు, ఇంటర్వ్యూలు ఉన్నాయని కొందరు వ్యక్తులు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి చెండేల్‌పై ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులను కంగన.. బాబర్స్ అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ బేస్ చేసుకుని కంగనపై కొందరు వ్యక్తులు కేసు నమోదు చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయమై తనకు అనిపించింది కంగన నిర్మొహమాటంగా చెప్పేసింది. అక్కడ నుంచి రచ్చ మొదలైంది.
సుశాంత్ ఆత్మహత్య కేసుతో పాటు, డ్రగ్స్ , నెపోటిజం విషయంలో కంగన సంచలన ఆరోపణలు చేసింది. అంతటితో ఈ హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ ఆగితే సమస్య తీవ్రత పెరిగేది కాదేమో.. మహారాష్ట్ర అధికార శివసేన పార్టీని సైతం టార్గెట్ చేసింది. సుశాంత్ కేసును విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ముంబై నగరం పీవోకేలా మారిందని విమర్శించింది. దీంతో శివసేన కీలక నేతతో పాటు పలువురు నేతలు ఆమెకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరికొందరైతే ఏకంగా ముంబైలో అడుగుపెట్టు చూద్దాం అంటూ హెచ్చరించారు.
ఈ వివాదాలన్నింటి నడుమ కేంద్రం కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ నేపథ్యంలోనే పాలక శివసేన, కంగనల మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. కంగన ఇంట్లోని ఆఫీసు నిర్మాణం అక్రమమంటూ బృహణ్ ముంబై కార్పొరేషన్ కూల్చివేసింది. ముంబైలోని ఆమె ఇంటికి అనుబంధంగా ఉన్న ఆఫీసు అక్రమ నిర్మాణమని కార్పొరేషన్ అధికారులు నోటీసు అంటించారు. అనంతరం ఆమె సమాధానం ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వకుండానే కూల్చివేతకు నోటీసిచ్చారు. ఇచ్చిందే తడవుగా బుధవారమే జేసీబీలతో అక్కడకు చేరుకుని కూల్చివేయడం మొదలుపెట్టారు. హుటాహుటిన కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతపై స్టే తీసుకొచ్చారు. అప్పటి నుంచి కంగన కాస్త తగ్గి తన షూటింగ్ పనులను చూసుకుంటోంది. తాజాగా ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments