'త్రయం' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
విష్ణురెడ్డి, అభిరాం, సంజన హీరో హీరోయిన్లుగా పంచాక్షరి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `త్రయం`. డా.గౌతమ్‌నాయుడు దర్శకత్వంలో పద్మజా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. వేర్వేరు మనస్తత్వాలున్న ముగ్గురు మధ్య నడిచే కథే ఈ చిత్రం. నాలుగు పాటలున్నాయి. అందరికీ నచ్చేలా సినిమాను తెరకెక్కించామని దర్శకుడు డా.గౌతమ్ నాయుడు తెలియజేశారు. సినిమాను డైరెక్ట్ చేసింది మా అబ్బాయే. తను సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనకు ఈ సినిమా సక్సెస్‌తో పాటు పేరును సంపాదించి పెట్టాలి. మంచి టీంతో కలిసి వర్క్ చేశామని నిర్మాత పద్మజా నాయుడు అన్నారు.
టీజర్ బావుంది. దర్శకుడు గౌతమ్ తొలి చిత్రమైనా యాక్షన్ పార్ట్ బాగానే తెరకెక్కించారని ముఖ్య అతిథిగా పాల్గొన్న బి.గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నందు, దర్శకుడు రాజకిరణ్, అభిరాం, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.
విష్ణురెడ్డి, అభిరాం, సంజన, అశోక్ చందనాని, జాకీ, సుబ్బరాయశర్మ, కోటేశ్వరరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి
ఫైట్స్ః కుంగ్ ఫూ శేఖర్, వై.రవి, లిరిక్స్ః నాగబాబు, రాంబట్ల శివ, రాంబట్ల శ్రీకాంత్, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ః విజయ్ భారతి, సంగీతంః యస్.వి.హెచ్, ఎడిటర్ః రామారావు జె.పి., ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః రాజేష్ వాక, ప్రొడ్యూసర్ః పద్మజా నాయుడు, కథ, దర్శకత్వంః డా.గౌతమ్ నాయుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments