కాచిగూడలో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెనుప్రమాదం
- IndiaGlitz, [Monday,November 11 2019]
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగివున్న పాసింజర్ రైలును ఎంఎంటీఎస్ ఢీకొన్నది. ఈ ఘటనలో సుమారు 35మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. సాంకేతిక లోపంతో ట్రైన్ ఆగివున్న ట్రాక్‌లోకి ఎంఎంటీఎస్ వచ్చింది. కాగా ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్లతోంది. పాసింజర్ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్ కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
కాగా ఎంఎంటీఎస్‌లోని మూడు.. పాసింజర్‌లోని మూడు మొత్తం ఆరు కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. పక్కనే ఉన్న రైలు పట్టాలపై ఆరు కోచ్‌లు పడిపోయాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఎంఎంటీఎస్ డ్రైవర్ శేఖర్ ఇంజన్‌లో ఇరుక్కుపోయారు. డ్రైవర్‌ను బయటికి తీసేందుకు రైల్వే పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇదిలా ఉంటే.. గాయపడినవారిలో ఎక్కువ ఎంఎంటీఎస్ వాళ్లే.. స్టేషన్ వచ్చింది కదా అని దిగడానికి రెడీగా ఉన్న టైమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో పదిమందిని ఉస్మానియా ఆస్పత్రికి మిగిలిన వారిని కాచిగూడ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.