మ‌న‌మంతా ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రివ్యూ..

  • IndiaGlitz, [Saturday,July 23 2016]

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న‌క‌థా చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు. ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహ‌సం...ఇలా డిఫ‌రెంట్ స్టోరీస్ తెర‌కెక్కించిన‌ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈసారి కూడా విభిన్న క‌థాంశంతో మ‌న‌మంతా అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు.

బ‌డికి వెళ్లే బాలిక, ఇంజ‌నీరింగ్ చ‌దివే టీనేజ్ కుర్రాడు, గాయ‌త్రి అనే హౌస్ వైఫ్, ఓ సూప‌ర్ మార్కెట్ కు అసిస్టెంట్ మేనేజ‌ర్... ఈ నలుగురి జీవితాలు అనుకోకుండా ఒక చోట కలవడం, దాంతో అందరి జీవితాలూ అనుకోని మలుపులు తిర‌గడం అనే వినూత్న కాన్సెప్ట్‌తో మ‌న‌మంతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రూపొందిన మ‌న‌మంతా ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను ఈరోజు రిలీజ్ చేసారు.

ఈ ట్రైల‌ర్ లో మోహ‌న్ లాల్...మిడిల్ క్లాస్ మ‌నిషికి డిస్కౌంట్ లో కొన్న తృప్తి ఎందులోను దొర‌క‌దు అంటాడు. అలాగే గౌత‌మి డ‌బ్బులు లేక‌పోవ‌చ్చు కానీ...బుద్ది లేకుండా పోలేదు అని చెబుతుంది. అలాగే ఇంజ‌నీరింగ్ చ‌దివే టీనేజ్ కుర్రాడుకి ల‌వ్ ప్రాబ్ల‌మ్, బ‌డికి వెళ్లే బాలికకి స్కూల్ లో ప్రాబ్ల‌మ్...ఇలా ఈ న‌లుగురి జీవితాల్లో అస‌లు ఏం జ‌రిగింది..? అనే పాయింట్ తో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో తార‌క‌ర‌త్న కూడా న‌టించ‌డం విశేషం. 1 వ‌ర‌ల్డ్ 4 స్టోరీస్..అంటూ ఈ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ డిఫ‌రెంట్ గా ఉండి సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తుంది.అలాగే ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ఇది రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు...డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం అని తెలుస్తుంది. మ‌న‌మంతా మ‌నం అంద‌రం చూడాల్సిన సినిమా... ఎందుకంటే ఇది మ‌నంద‌రి క‌థ‌.

ఈ చిత్రం కోసం మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ టైమ్ తెలుగు నేర్చుకుని డ‌బ్బింగ్ చెప్ప‌డం ఓ విశేషమైతే... సీనియ‌ర్ న‌టి గౌత‌మి దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత న‌టించ‌డం మ‌రో విశేషం. మ‌నంద‌రి క‌థ‌తో వ‌స్తున్న‌ మ‌న‌మంతా మ‌నంద‌రి మ‌న‌సులు దోచుకుని మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.