'చీకటిరాజ్యం' ట్రైలర్ రివ్యూ

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజేష్‌ ఎం. స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్‌. చంద్రహాసన్‌ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం చీకటిరాజ్యం'. ఈ చిత్రాన్ని గోకుల్ మూవీస్ తెలుగులో విడుద‌ల చేస్తుంది.

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌, కిషోర్‌, సంపత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్‌ చాలా డిఫరెంట్‌ రోల్‌లో కన్పించబోతున్నారు. హైదరాబాద్‌, చెన్నై పలు అందమైన ప్రదేశాల్లో కేవం 40 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని శరవేగంగా జరుపుకుంటోంది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమా కేవ‌లం ఓ రాత్రిలో జ‌రిగే క‌థ‌, నాలుగుపాత్రల చుట్టూనే ఎక్కువ‌భాగం సినిమా తిరుగుతుంద‌ని గ‌తంలో ద‌ర్శక నిర్మాత‌లు తెలియ‌జేశారు. మ‌రి ఈ ట్రైల‌ర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే...

ట్రైల‌ర్ నిడివి 156 సెకండ్స్‌. గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ తో ట్రైల‌ర్ స్టార్టవుతుంది. క‌మ‌ల్ హాస‌న్ బ్యాక్ నుండి చూపించ‌డంతో ట్రైల‌ర్ స్టార్టవుతుంది. ముంభైలో మీ గురించి చాలా విన్నాను. మీరిక్కడే ఉన్నార‌ని చెప్తే ఎలాగైనా క‌ల‌వాలనుకున్నాను...ఇది త్రిష క‌మ‌ల్‌తో చెప్పే డైలాగ్, నీ గురించి కూడా బాగా తెలుసు ఎన్‌.సి.బి.,. ఎంట్రా అది నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో... అంటూ క‌మ‌ల్ తో ప్ర‌కాష్ రాజ్ చెప్పే డైలాగ్, ట్వెంటిఫోర్ అవ‌ర్స్ లో ముగ్గురు చ‌నిపోయారు., వాసుఎక్క‌డ‌, ప‌ది నిమిషాల్లో కాల్ చేస్తానన్నారు, దొరికితే లోప‌లేసి కుమ్మేస్తారు, ఆ పోలీస్ గాడు దొరికితే వేసేయాల్ రా మ‌న‌ల్ని వెర్రీ ప‌ప్పల‌నుకుంటున్నాడు, వాడు ష‌ర్ట్ కొంచెం న‌లిగినా చంపేస్తాను, నేను చెప్తే చేస్తాను ఇలా చాలా డైలాగ్స్ విన‌ప‌డ‌తాయి. దాదాప న‌ల‌భై సెకండ్ల త‌ర్వాతే క‌మ‌ల్‌హాస‌న్‌ను క్లియ‌ర్‌గా చూపిస్తారు. ట్రైల‌ర్ ఫుల్ యాక్షన్ పార్ట్ తో నిండి ఉంది. ఈ ట్రైల‌ర్ లో ఎక్కువ‌భాగం క‌మ‌ల్‌, ప్రకాష్‌రాజ్‌, త్రిష‌, కిషోర్‌, సంప‌త్ రాజ్ వీళ్ళే ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌తారు. సినిమా అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ అని మ‌రోసారి ఈ ట్రైల‌ర్‌తో చెప్పారు.

అలాగే ట్రైల‌ర్‌లో ఓ ప‌బ్ ఎక్కువ‌గా క‌న‌ప‌డుతుంది. క‌మ‌ల్ నార్కో అనాలసిస్ విభాగానికి చెందిన ఆఫీస‌ర్ అని తెలుస్తుంది. గిబ్రాన్ మ్యూజిక్ ఎక్సలెంట్, జాన్ వ‌ర్గుసే సినిమాటోగ్రపీ సినిమాకి హైలైట్ కానుంద‌నే విష‌యాలు తెలుస్తున్నాయి. మ‌రి పోలీస్ విభాగానికి చెందిన హీరోకి, విల‌న్‌కి గొడ‌వేంటి, విల‌న్స్ వ‌ల్ల హీరో ఎలాంటి స‌మ‌స్యలు ఎదుర్కొన్నాడు, ఎంట‌నేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.