టాలీవుడ్ రచయిత బుర్రా ఇంట్లో విషాదం...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ ఇంట్లో విషాదం నెలకొంది. నాటక రంగ ప్రముఖులు, అభినవ చింతామణిగా పేరొందిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి(84) ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుర్రా ఆదివారం నాడు మెహదీపట్నంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో బుర్రా సాయిమాధవ్ పెద్ద కుమారుడు. సాయిమాధవ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయనక్కర్లేని పేరు.
ఆయన మరణవార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, నాటకరంగ ప్రముఖులు మెహిదీ పట్నం చేరుకుని భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా.. బుర్రా సుబ్రమణ్య శాస్త్రి మృతి ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. కాగా రేపు అనగా సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments