నటుడు మురళీ మోహన్ ఇంట విషాదం..

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇంట విషాదం నెలకొంది. గురువారం మురళీ మోహన్ తల్లి మాగంటి వసుమతిదేవి తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం ఆమె స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా.. వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇటీవలే మురళీమోహన్ తన తల్లి మాగంటి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే.

రేపు అంత్యక్రియలు..

శుక్రవారం ఉదయం వసుమతీదేవి అంత్యక్రియలు రాజమండ్రిలోని జేఎన్ రోడ్‌లో కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. మురళీకి మాతృవియోగం కలిగినట్లు తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. రేపు జరగనున్న అంతిమ సంస్కారాలకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో పాటు పలువురు ఆయన సహచరులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.