కాజల్ ఇంట్లో విషాదం
Send us your feedback to audioarticles@vaarta.com
కాజల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కాజల్ బామ్మ శనివారం తెల్లారుజామున కన్నుమూశారు. కాజల్ బామ్మ ఫొటో చూస్తే కాజల్ పోలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కాజల్ ఆమె ఫొటోను కూడా షేర్ చేశారు. `మా నాని చాలా అందగత్తె. ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. ఆమెలో ఉన్న దయ, ఆమె కనబరిచే డిగ్నిటీ, ఆమె పాటించిన విలువలు మాకు మార్గదర్శకాలు. అనంతవిశ్వాన్ని ప్రేమించగలిగే మనస్తత్వం ఆమె సొంతం. కొన్ని సందర్భాల్లో ఆమె కనబరిచే ధైర్యం, ఆ గ్రేస్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి.
మా బామ్మ 1929లో డిసెంబర్ 18న పుట్టారు. 30.3.2019లో కన్నుమూశారు`` అని కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబానికి అమితమైన విలువిచ్చే కాజల్ తన భామ ఫొటోను పోస్ట్ చేసి, ఆమె గురించి రాసిన తీరు అందరినీ కట్టిపడేసింది. కాజల్ బామ్మకు శాంతి కలగాలని నెటిజన్లు రిప్లు ప్రకటిస్తున్నారు. ఆమె నటించిన `సీత` సర్ప్రైజ్ ఈవెంట్ అమరావతిలో శనివారం రాత్రి జరగనుండటం గమనార్హం. ఈ కార్యక్రమానికి కాజల్ వస్తారో, రారో మాత్రం చెప్పలేం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments