కాజల్ ఇంట్లో విషాదం
- IndiaGlitz, [Saturday,March 30 2019]
కాజల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కాజల్ బామ్మ శనివారం తెల్లారుజామున కన్నుమూశారు. కాజల్ బామ్మ ఫొటో చూస్తే కాజల్ పోలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కాజల్ ఆమె ఫొటోను కూడా షేర్ చేశారు. 'మా నాని చాలా అందగత్తె. ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. ఆమెలో ఉన్న దయ, ఆమె కనబరిచే డిగ్నిటీ, ఆమె పాటించిన విలువలు మాకు మార్గదర్శకాలు. అనంతవిశ్వాన్ని ప్రేమించగలిగే మనస్తత్వం ఆమె సొంతం. కొన్ని సందర్భాల్లో ఆమె కనబరిచే ధైర్యం, ఆ గ్రేస్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి.
మా బామ్మ 1929లో డిసెంబర్ 18న పుట్టారు. 30.3.2019లో కన్నుమూశారు'' అని కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబానికి అమితమైన విలువిచ్చే కాజల్ తన భామ ఫొటోను పోస్ట్ చేసి, ఆమె గురించి రాసిన తీరు అందరినీ కట్టిపడేసింది. కాజల్ బామ్మకు శాంతి కలగాలని నెటిజన్లు రిప్లు ప్రకటిస్తున్నారు. ఆమె నటించిన 'సీత' సర్ప్రైజ్ ఈవెంట్ అమరావతిలో శనివారం రాత్రి జరగనుండటం గమనార్హం. ఈ కార్యక్రమానికి కాజల్ వస్తారో, రారో మాత్రం చెప్పలేం.