హృతిక్ కుటుంబంలో విషాదం
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత జె.ఓం ప్రకాశ్(93) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈయన భగవాన్ దాదా, అఖిర్ క్యోం, ఆప్ కీ కసమ్ వంటి పలు చిత్రాలను ఈయన రూపొందించారు. అమితాబ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖలు ఓం ప్రకాశ్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు.
గత నెలలోనే హృతిక్ ఈయన్ని కలిసి తన `సూపర్ 30` సినిమా గురించి ముచ్చటించారు. అంతే కాకుండా తన తాతయ్య తనకు లెక్కలు గురువని తెలిపారు. చిన్నప్పుడు తడబడుతూ మాట్లాడే హృతిక్ సమస్యను ఆయనే గుర్తించి, తొలగిపోయేలా చర్యలు తీసుకున్నారట. ఈ విషయాన్ని హృతిక్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments