Prime Minister Modi:అలర్ట్: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

  • IndiaGlitz, [Saturday,November 11 2023]

ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే మాదిగ విశ్వరూప సభకు ఇవాళ(శనివారం)సాయంత్రం హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సభ ముగిసే వరకు సికింద్రాబాద్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు అదనపు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరకించాలని కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ఏరియాలు..

సంగీత్ క్రాస్ రోడ్ నుంచి బేగంపేట్ వచ్చే వాహనాలను వైఎంసీఏ క్లాక్ టవర్, ప్యాట్నీ, సీటీవో, రసూల్ పురా మీదుగా మళ్లింపు .

బేగంపేట్ నుంచి సంగీత్ క్రాస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను బాలం రాయి, బ్రూక్ బాండ్, టివోలి, వైఎంసీఏ మీదుగా మళ్లిస్తారు.

బోయిన్ పల్లి, తాడ్ బండ్ వైపు నుంచి టివోలి వచ్చే వాహనాలను బ్రూక్ బాండ్ వద్ద సీటీవో, ట్యాంక్ బండ్ మీదుగా దారి మళ్లిస్తారు.

తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్ గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే వాహనాలను టివోలి వద్ద స్వీకార్ ఉపకార్ వైపు దారి మళ్లిస్తారు.

జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్ ల్యాండ్స్, రాజ్ భవన్ మీదుగా దారి మళ్లిస్తారు.

టివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ వెళ్లే రూట్‌లో వాహనాల అనుమతికి నిరాకరణ. ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్డీ రోడ్ లు క్లోజ్ చేస్తారు.

పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో వాహనాల రద్దీ పెరగనుంది.

కార్ఖానా నుంచి ప్యాట్నీ రూట్ లో స్వీకార్ ఉపకార్ వద్ద వైఎంసీఏ, ప్యాట్నీ, టివోలి, సీటీవో వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి స్వీకార్ ఉపకార్ వైపు నో ఎంట్రీ.

ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేట విమానశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటరు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్తారు. సురు గంటపాటు ఈ సభలో ఉండనున్నారు. సభలో ప్రసగించిన అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.