‘సరిలేరు..’ చూసొస్తుండగా సంజనకు షాకిచ్చిన పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మికమందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టాక్ పరంగా.. కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తున్నారు. తాజాగా.. నటి సంజన ఈ సినిమా చూసింది. థియేటర్ నుంచి తిరిగొస్తుండగా.. తాను సినిమా చూశాననే విషయాన్ని చెప్పడానికి సెల్ఫీ వీడియో తీసింది. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వీడియో తీసిన ఆనందం కొన్ని నిమిషాల్లోనే కరువైంది.
ఈ వీడియో చూసిన బెంగళూరు పోలీసులు సంజనకు షాకిచ్చారు. ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నోటీసులు పంపడమేకాక, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో సంజన హతాశురాలైంది. పోలీసులపై ఆ బ్యూటీ రుసరుసలాడుతోంది. కాగా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడటం తప్పన్న విషయం తెలిసిందే. అయితే ఫోన్‌లో మాట్లాడుతూ.. సెల్ఫీ వీడియోలు తీయకూడదని పోలీసులు పలు మార్లు చెప్పడమే కాదు.. ఇలా చేసిన వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయితే.. నీతులు చెప్పే సెలెబ్రిటీలే.. ఇలాంటి చర్యలకు పాల్పడటంతో సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. వారు వీరు అనే తేడా లేకుండా.. చలాన్లు వేస్తామని పోలీసులు తేల్చిచెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సంజన ఎలా స్పందిస్తుందో..? పోలీసులిచ్చిన నోటీసులపై సంజన ఏమని వివరణ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments