ఎన్టీఆర్ దర్శనం కోసం ట్రాఫిక్ జామ్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే...చెన్నైలో ఎన్టీఆర్ ని చూసేందుకు తమిళ అభిమానులు ఫోటోలో చూపిస్తున్న విధంగా బారులు తీరారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ లో స్పందిస్తూ...చెన్నైలో ట్రాఫిక్ జామ్...తారక రాముడి దర్శనం కోసం అంటూ ఫోటోలను పోస్ట్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా తారక్ కి ఈరేంజ్ లో అభిమానులు ఉండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments