Telangana Formation Day: తెలంగాణ కాదు.. కేసీఆర్ ఫ్యామిలీ బంగారమైంది : మహేశ్ కుమార్ గౌడ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ మనకు ఇచ్చిన కానుక తెలంగాణ రాష్ట్రమన్నారు. ఇందిరా గాంధీ కూడా చేయలేని సాహసం సోనియా గాంధీ చేశారని మహేశ్ గౌడ్ ప్రశంసించారు. తెలంగాణ బంగారు మయం అవుతుందని బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు భావించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం, ఆయన తాబేదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బంగారం అయ్యారంటూ మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కేబినెట్ మొత్తం తెలంగాణ ద్రోహులే:
తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేసుకుంటే... 400 మందికి మాత్రమే సహాయం చేసారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ కేబినెట్‌లో అందరూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని మహేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం రూ. 4.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుందని, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదని చురకలు వేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ బీజేపీ పాత్ర అంతగా లేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ పార్లమెంట్‌లో అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పదని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
అధికారమే లక్ష్యంగా చింతన్ శిబిర్:
మరోవైపు 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కీసరలో జరుగుతున్న ఈ కార్యక్రమం నిన్న మొదలైంది. తొలిరోజు సమా వేశంలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థాగత, రాజకీయ, వ్యవసాయ, యువజన, సామాజిక న్యాయ, ఆర్థిక కమిటీలు సమావేశమై కూలం కషంగా చర్చించాయి. ఉదయ్‌పూర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతన్ శిబిర్ డిక్లరేషన్ లోని అన్ని అంశాలకు కమిటీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments