Modi:ఎన్డీఏ అభివృద్ధి వైపు.. వైసీపీ అవినీతి వైపు.. ప్రధాని మోదీ విమర్శలు

  • IndiaGlitz, [Tuesday,May 07 2024]

వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ స్థానిక నూకాలమ్మ తల్లికి నమస్కరిస్తూ.. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటున్నారు.

అనకాపల్లి బెల్లం, తెలుగు భాష రెండు కూడా మధురమైనవి, అద్భుతమైనవి. జూన్ 4న ఈ తియ్యదనం మరింత పెరగబోతోంది, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలవబోతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే గెలవడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది. తద్వారా అభివృద్ధి కొత్త ఎత్తులకు చేరుతుంది. ఏపీ నుంచి అనేకమంది ప్రవాసులు విదేశాల్లో నివసిస్తున్నారు. భారత్ సాధించిన ఘనతతో ఇప్పుడు వారందరూ భారతీయులుగా ఎంతో గుర్తింపు పొందుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ, వైసీపీ రెండూ ఒకటే. కర్ణాటకలో ట్యాంకర్, భూ మాఫియా ప్రభుత్వం నడుస్తోంది... ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రక్షణ కల్పిస్తాం. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇళ్లు కేటాయించినా, ఈ ప్రభుత్వం నిర్మించలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వ పనితీరుకు పెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్టును నాడు జగన్ రెడ్డి తండ్రి ప్రారంభించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్, ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు.

ఎన్డీయే మంత్రం అభివృద్ధి... అభివృద్ధి... అభివృద్ధి. వైసీపీ మంత్రం అవినీతి... అవినీతి... అవినీతి! ఈ రోజున ఏపీలో అనేక పంచదార పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాం. ఈ ప్రాంతానికి పెట్రోలియం యూనివర్సిటీని తీసుకువచ్చాం, పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ కు ఆమోదం లభించింది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు రూ.1000 కోట్ల సాయం అందించాం. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి, ఫార్మారంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఏపీలో అదే పరిస్థితి నెలకొని ఉంది. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

More News

Chandrababu:జగన్ నీ సీన్ అయిపోయింది.. వచ్చేది కూటమి ప్రభుత్వమే: చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రజల కోసం ఆలోచించిన గొప్ప నాయకుడు అని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొనియాడారు.

PV Ramesh:ఎల్లో మీడియా ట్రాప్‌లో పీవీ రమేష్.. అడ్డంగా దొరికిపోయి దిద్దుబాటు చర్యలు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.

Modi:వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతిలో నంబర్‌వన్: మోదీ

వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు.

Mudragada:పవన్ కల్యాణ్‌ ముగ్గురు భార్యలను కూడా పరిచయం చేయాలి: ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

DGP of AP:ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ ఆదేశాలు

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో తక్షణమే విధుల్లో